స్త్రీ,శిశు సంక్షేమానికి మరింత కృషి చేస్తాం.. మంత్రి మల్లారెడ్డి

470
Minister Malla Reddy
- Advertisement -

శిశు సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఇవాళ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌పై సమీక్ష సమావేశం నిర్వహించము.
ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం అందాలనదే మా ప్రభుత్వం ఉద్దేశ్యం. అంగన్వాడీలలో చిన్న పిల్లలకు కూడా మంచి ఆహారం అందజేస్తున్నాము. అంగన్వాడీల కోసం భావనలు నిర్మించాలని చర్చించిచాము. పిల్లల అందరికి అంగన్వాడీలో చదువు చెప్పే విదంగా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు.

Minister Malla Reddy

ప్రైవేట్ విద్య సంస్థల కంటే అద్భుతమైన విద్యను, క్రీడలను అందిస్తున్న విద్యా సంస్థలు గురుకులాలు.
ఎల్కేజి,యూకేజీ కూడా అదేవిధంగా అంగన్వాడీలలో చేయాలనేది మా లక్ష్యం. పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యి అంగన్వాడీలను దత్తత తీసుకోవాలని చెప్తాం. పారిశ్రామిక వేత్తల విరాళాలతో అంగన్వాడీలను అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే చాలా మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. త్వరలోనే సఖి భవనాన్ని నిర్మిస్తున్నాం. శిశు సంక్షేమ శాఖను మరింత ముందుకు తీసుకువెళ్తాను. అని శిశు సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి వెల్లడించారు.

- Advertisement -