- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత,సి.ఎం కే.సి.ఆర్ చొరువతోనే ప్రముఖ దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు మంత్రి మల్లారెడడి. మంగళవారం ఆయన పోచారం మున్సిపాలిటీ పరిధి సంస్కృతి టౌన్షిప్ లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం,స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొనడం అదృష్టకరం అన్నారు. దైవ చింతనలోనే ప్రశాంతత లభిస్తుందని,ప్రజలపై స్వామి వారి దయ ఉండాలని కోరుకుంటున్నా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి గారు,వైస్-చైర్మన్ రెడ్యానాయక్ గారు,స్థానిక కౌన్సిలర్లు,నాయకులు,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -