అందరం ఐక్యతతో కరోనాను తరిమికొడదాం..

181
Minister Malla Reddy Distributed Essential Goods
- Advertisement -

తెలంగాణ కార్మిక,ఉపాధి,శిక్షణ,కార్మాగారముల,నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రి సి.హెచ్ మల్లా రెడ్డి ఈ రోజు జవాహర్‌నగర్ మున్సిపల్ కార్పోరేషన్ లోని వార్డ్ 2లో దాదాపు 1000 మంది నిరుపేద ప్రజలకు బియ్యం మరియు ఇతర నిత్యవసర సరుకులను పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనాకు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. స్వీయ నియంత్రణతో మనం కరోనాను నిర్మూలించవచ్చు. అన్నారు.

Minister Malla Reddy Distributed Essential Goods

కరోనా వైరస్ కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుంది.ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది.ప్రతి ఒక్కరు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. సామాజిక, పరిశుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలి. ఇంకా కొన్ని రోజులు లాక్ డౌన్‌కు సహకరించి అందరం ఐక్యతతో కరోనా వైరస్ తరిమికొడదామన్నారు మంత్రి.

ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండండి.. అత్యవసరం అయితేనే బయటకి వెళ్ళండి. ఈ లాంటి విపత్కర పరిస్థితుల్లో దాతలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనందున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నమని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్,సిహెచ్ మహేందర్ రెడ్డి,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -