ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన..

115
ktr

భారీ వర్షాలకు హైదరాబాద్ జనజీవనం అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా పలు కాలనీలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి కేటీఆర్.

వరదలో చిక్కుకున్న హబ్సీగూడ, రామంతాపూర్‌ ప్రాంతాల్లో రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే సహాయక చర్యల్లో పాల్గొనాలని స్థానిక ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డితో పాటు కార్పొరేటర్‌కు సూచించారు.