జోగుళాంబ గద్వాల జిల్లాలో ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. ఈమేరకు కేటీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు వీ. శ్రీనివాస్ గౌడ్, సబిత ఇంద్రారెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు.. కొద్దిసేపటి కిత్రం ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్‌లో బయలుదేరివెళ్లారు.
మంత్రి కేటీఆర్ గద్వాల పర్యటన..
ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9గంటలకు అలంపూర్ చేరుకొని 100పడకల దవాఖానకు భూమి పూజ చేస్తారు. అక్కడ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 10.15నిమిషాలకు జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలు దేరి 11గంటలకు గద్వాల మండలం గోన్‌పహాడ్ వద్ద షాదీఖాన నిర్మాణానికి భూమిపూజ, 11.15నిమిషాలకు సంగాల పార్కు ప్రారంభోత్సవం, 12.00గటంలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా గ్రంథాలయ భవనం, జూనియర్ కళాశాల కోసం భనవ నిర్మాణానికి శంకుస్థాపన, డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులకు భూమిపూజ, 12:30గంటలకు ఆడిటోరియం నిర్మాణానికి భూమిపూజ, 1:00గంటలకు మార్కెట్ యార్డు ఆవరణలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు భూమి పూజ, 1:30టీఎస్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు.
అనంతరం నదిఅగ్రహారం చేరుకుని అక్కడ 2:00గంటలకు పీజీ కళాశాలలో నూతనంగా నిర్మించిన మహిళ వసతి గృహాన్ని ప్రారంభించి, అక్కడే అదనపు తరగతి గదులకు భూమిపూజ చేస్తారు. 2:10లంచ్ అనంతరం 2:45కు అక్కడ నుంచి బయలుదేరి ఆర్వోబీ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో 3:15కు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. 4:15కు సభ ముగియగానే అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు మంత్రి కేటీఆర్ బయలు దేరనున్నారు.