ఐటీ పరిశ్రమ ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశం..

246
ktr it
- Advertisement -

హైదరాబాద్‌లోని పలు ఐటీ పరిశ్రమ ప్రతినిధులతో మంత్రి కే. తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు చేపట్టిన కార్యక్రమాలను, అనుసరిస్తున్న వ్యూహన్ని వారికి వివరించారు. సాధ్యమైనంత త్వరగా ఈ ఆపత్కాలం నుంచి బయటపడతామన్న విశ్వాసాన్ని మంత్రి కే. తారకరామారావు వ్యక్తం చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితుల ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలతోపాటు వివిధ రంగాల పరిశ్రమలకు సైతం అనుకూలంగా, సహాయకారిగా పని చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

లాక్ డౌన్ నియమాలను కఠినంగా అమలు చేసి వైరస్ కట్టడి చేసే ప్రభుత్వ ఉద్దేశాన్ని పేర్కొన్న మంత్రి కేటీఆర్, లాక్ డౌన్‌కి ఏవిధంగా ముగింపు పలకాలన్న విషయంలోనూ తాము ఆలోచన చేస్తున్నామని, లాక్ డౌన్ అనంతర పరిస్థితులను సైతం అంచనా వేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. లాక్ డౌన్ ఎగ్జిట్ ప్రణాళికను రూపొందించే ఈ సందర్భంగా మరోసారి పారిశ్రామిక రంగ ప్రతినిధులతో ప్రత్యేకంగా సంప్రదిస్తామన్న మంత్రి కేటీఆర్ వారికి తెలియజేశారు.

ktr 4

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలను ఐటీ పరిశ్రమ ప్రతినిధులు అభినందించారు. ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలకు అన్ని విధాలుగా తమ మద్దతు ఉంటుందని ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చిన ఐటీ పరిశ్రమ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఐటి మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

- Advertisement -