గ్రేటర్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గంలో రూ.9.28 కోట్లతో నిర్మించిన అండర్ పాస్,బైరామల్ గూడ వద్ద రూ.28.642 కోట్లతో ఏర్పాటుచేసిన ఫ్లైఓవర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు కేటీఆర్.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్….గడ్డి అన్నారం మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. ఎల్బీనగర్‌లో భూ రిజిస్ట్రేషన్ సమస్య కూడా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. కొత్త పెన్షన్లు 2 నుంచి 3 నెలల్లో అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
వర్షాలు, వరదల వల్ల ఎల్బీనగర్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ….రూ. 2,500 కోట్లతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఎల్బీనగర్ పరిధిలో మంచి నీటి సమస్యను పరిష్కరించేందుకు 12 రిజర్వాయర్లు నిర్మించామన్నారు. 353 కిలోమీటర్ల మేర వాటర్ పైపులైన్‌లు వేశామన్నారు.