- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ ,అదే రోజు మిథునలగ్న సుముహుర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఆలయ అర్చకులు. బాలాలయంలో ఉద్ఘాటన పూజల నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు నిలిపివేయనున్నారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత సేవలు జరిపించుకోవాలని ఆలయ అర్చకులు సూచించారు.
21 నుంచి 28వ తేదీ వరకు పాంచరాత్రాగమ పద్ధతిలో ఉద్ఘాటన పూజలు నిర్వహించనున్నారు. 21 నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో పంచకుండాత్మక హోమం చేపట్టనున్నారు.
- Advertisement -

