సిరిసిల్లలో మంత్రి కేటీఆర్…

51
ktr
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. తారకరామారావు పర్యటించారు. మొదటగా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు.

25 లక్షల రూపాయల ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, 20 లక్షల రూపాయల సీడీపీ నిధులతో నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణం, 7 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న మల్లారెడ్డిపేట నుండి గంభీరావుపేట రోడ్డుపై నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మల్లారెడ్డిపేట్ గ్రామంలోని గుట్టపై కొలువైన హనుమాన్ ఆలయంలో ప్రత్యేకపూజలు చేసారు. ఆతర్వాత మాఘ అమావాస్య సందర్భంగా  జిల్లా కేంద్రంలోని మానేరు వాగు తీరంలో జరుగుతున్న గంగమ్మ జాతరకు హాజరైయ్యారు.

- Advertisement -