నిజామాబాద్ ఐటీ టవర్..సర్వం సిద్ధం

48
- Advertisement -

నిజామాబాద్ ఐటీ టవర్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రేపు మంత్రి కేటీఆర్…నిజామాబాద్‌ ఐటీ టవర్‌ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మంత్రి కేటీఆర్. టైర్‌ 2 పట్టణాలు, నగరాలకు ఐటీ సెక్టార్‌లో విస్తరించడంలో భాగంగా నిజామాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌ను ప్రారంభిస్తున్నా అని తెలిపారు. యువత తమ నైపుణ్యాలు పెంచుకోవడానికి, సరికొత్త ఆవిష్కరణల కోసం ఇందులో టీ-హబ్‌, టాస్క్‌ సెంటర్లను కూడా ఉన్నాయని…. దీనిద్వారా తెలంగాణ అభివృద్ధిలో యువత పాలుపంచుకునే అవకాశం లభిస్తుందని వెల్లడించారు.

నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బైపాస్‌ రోడ్డుకు ఆనుకొని ఉన్న 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐటీ టవర్‌ కోసం ఆరేండ్ల క్రితమే కేటాయించారు. రూ.50 కోట్ల వ్యయంతో 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఎకరం భూమిలో ఐటీ టవర్‌… మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్‌ విస్తరణ కోసం వదిలేశారు.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్..

ఇప్పటికే కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేటలో ఐటీ హబ్‌లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -