విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి టీఆర్ఎస్ మద్దతు..

182
ktr
- Advertisement -

విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి టీఆర్ఎస్ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేశారని… విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉందన్నారు. వీలైతే… వైజాగ్ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటామని..పోరాటంలో కలిసి ఉంటామని హామీ ఇచ్చారు.

వాణీదేవి ప్రశ్నించే గొంతు కాదు.. పరిష్కరించే గొంతు అవుతారని తెలిపారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అన్నారు కానీ నిరంతర విద్యుత్, ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. 65 ఏళ్లలో కాని పనులు.. 6 ఏళ్లలో చేసి చూపించామని గుర్తుచేశారు.

సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఇదే మోడీ… మన్మోహన్ సింగ్ పై దుమ్మెత్తి పోశారని…మరి ఇప్పుడు ధరలు రెట్టింపు అయ్యాయని, ఇప్పుడు ఎవరిని అనాలని చురకలు అంటించారు. దేశం కోసం ధర్మం కోసం అంటారని.. పొద్దున లేస్తే… మతం కులం అంటారని ఫైర్‌ అయ్యారు .

- Advertisement -