ప్రజల కోసమే ప్రభుత్వం – కేటీఆర్‌

48
- Advertisement -

ప్రజల కోణంలోనే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ఐటీ, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన పట్టణ ప్రగతి సదస్సులో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో జరిగిన మాస్టర్‌ ప్లాన్‌ నిరసనలపై స్పందించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్‌ కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనలు, పరిస్థితులపై అదనపు కలెక్టర్‌ ను అడిగి తెలుసుకున్నారు.

కామారెడ్డి జిల్లాలో కేవలం మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదా మాత్రమే ఇచ్చారని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ముసాయిదాలో మార్పులు చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వినతులు ఇవ్వొచ్చని, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మాస్టర్‌ ప్లాన్ గురించి ప్రజలకు వివరించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. రైతులు తమ 500 ఎకరాల భూమి ఇండస్ట్రీయల్‌ కు పోతోందని ఆందోళన చెందుతున్నారని, ఇటీవలే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు తాను పేపర్‌ లో చూశానని, తెలంగాణ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టేందుకు లేదని కేటీఆర్‌ తెలిపారు.

- Advertisement -