అవికాగోర్‌ సీక్రెట్ బయటపెట్టిన నాగ్‌

142
- Advertisement -

అవికా గోర్‌… బుల్లితెరనటిగా.. టాలీవుడ్‌ హీరోయిన్‌ గా మనకందరికి సుపరిచితమే… కానీ అవికా గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం గురించి ఎవరికి తెలియదనే చెప్పాలి. ఆ సీక్రెట్‌ ను టాలీవుడ్‌ అగ్ర హీరో నాగార్జున బయటపెట్టేశారు. ఇంతకు అదేంటంటే… అవికా గోర్‌ పాన్‌ ఇండియా యాక్టర్‌ కాదట… పాన్ వరల్డ్ స్టార్ అంటూ నాగార్జున షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఈ సినిమా ట్రైలర్‌ ను అక్కినేని నాగార్జున లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల క్రితమే తాను రియో నగరానికి వెళ్లానని, అక్కడ ఓ స్టూడియో చూద్దామని వెళ్తే అనుకోకుండా తనకు అవికాగోర్‌ ఫోటో కనిపించిందని తెలిపారు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌ ను వాళ్లు డబ్‌ చేసి రిలీజ్‌ చేశారని నాగార్జున తెలిపారు. రియోలో కూడా చిన్నారిపెళ్లి కూతురు సీరియల్‌ పెద్ద హిట్‌ అయ్యిందని, పెళ్లి కూతురు సీరియల్ ను 128 దేశాల్లో డబ్‌ చేశారని నాగార్జున పేర్కొన్నారు. ఇప్పుడు ఇండియాలో పాన్‌ ఇండియా ట్రెండింగ్‌ నడుస్తోందని, కానీ పది సంవత్సరాల క్రితమే అవికాగోర్‌ పాన్‌ వరల్డ్ స్టార్‌ గాఎదిగిపోయిందని నాగార్జున అన్నారు. అంతేకాకుండా అవికాగోర్‌ కజకిస్తాన్‌లో రెండు సినిమాలు చేసిందని, విదేశాల్లో అవికా క్రేజ్‌ మామూలుగా లేదంటూ అవికాపై నాగ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఇదిలా ఉంటే.. పాప్‌ కార్న్‌ సినిమాతో అవికాగోర్‌ ప్రోడ్యూసర్‌ అవతారం ఎత్తినట్టు తెలుస్తోంది.

- Advertisement -