55ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్లడొండ జిల్లాకు ఒరిగిందేమి లేదన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు. నల్గొండ జిల్లా నకిరేకల్ కు చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ఈకార్యక్రమంలో పలువరు నేతలకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఆహారశుద్ది పరిశ్రమను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్ధాపన చేయిస్తామన్నారు.
కాంగ్రెస్ పాలనలో కనీసం రోడ్లను కూడా అభివృద్ది చేయలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నల్లగొండలో అభివృద్ది జరుగుతుందన్నారు. నల్లగొండ జిల్లా నుంచి ఎంతో మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులున్నా ప్రజలకు చేసిందేమిలేదన్నారు. నల్లగొండ జిల్లా అభివృద్దిపై కమిట్ మెంట్ ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణను నిర్మించుకుంటున్నామన్నారు. అన్ని కులాలకు కేసీఆర్ న్యాయం చేస్తున్నారని..రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అభివృద్ది పథకాలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులను ఆదుకునేందుకు రైతు బంధు పథకం ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.8వేలు ఇస్తున్నామన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా ఆడబిడ్డలకు ఆర్ధిక సాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 24గంటల కరెంట్ అందిస్తున్నామని తెలిపారు.