‘వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా: కేటీఆర్

186
Minister KTR Speech at warangal over Warangal Mega Textile Park
- Advertisement -

భారతదేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌కు శంకుస్థాపనం జరిగిన సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారతదేశంలోనే అతిపెద్దదైన టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన జరగడం శుభసూచకమని తెలిపారు.

మొదటి రోజునే ఈ పార్క్‌లో 14 సంస్థలు.. 3,900 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయని చెప్పారు. ప్రస్తుత ఒప్పందాలతోనే 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందని, తెల్ల బంగారాన్ని పండించే రైతులు తెలంగాణలో కోకోల్లలుగా ఉన్నారని అన్నారు.

ఈ పత్తిని నూలుగా వడికే అపారమైన నేతన్నలు తెలంగాణలో ఉన్నారని తెలిపారు. మన వరంగల్ జిల్లా నుంచి వలసపోయిన నేతన్నలతో సీఎం కేసీఆర్ సమావేశమై ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 1200 ఎకరాల భూమి కోల్పోతున్నప్పటికీ.. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినందుకు వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని తెలిపారు.

భూములు కోల్పోయిన వారి కుటుంబాల్లో.. ఇంటికి ఒకరికి టెక్స్‌టైల్ పార్కులో ఉద్యోగాలిస్తామన్నారు. వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని భరోసానిచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో.. కాలుష్యం లేకుండా పార్క్‌ను ఏర్పాటు చేసుకోబోతున్నామని, సంవత్సరం లోపే పార్క్ ప్రారంభం చేస్తామని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -