బీజేపీ నాయకులు చదువుకుంది వాట్సాప్ యూనివర్సిటీ అని వారికి ఏం తెలియదన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్ధానాల విద్యార్ధి విభాగం నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్….నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన పరిస్థితులను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కడిగా ప్రారంభమై కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. తెలంగాణ వచ్చేదాక కొట్లాడుతానని లేకపోతే రాళ్లతో కొట్టి చంపండి అని ప్రకటించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. ఎంతమంది నిరుత్సాహ పర్చిన వెనక్కి తగ్గకుండా రాష్ట్రాన్ని సాధించి సగర్వంగా దేశంలో నెంబర్ 1గా నిలిపిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.
ఈ తరం పిల్లలకు కేసీఆర్ పడిన కష్టాలు తెలియవని…ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదన్నారు. అలాంటి నాయకుడి మీద కొంతమంది మాట్లాడుతున్నారు…తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేని వాళ్లు మాట్లాడుతున్నారని వారందరికి బుద్ది చెప్పాలన్నారు. ఆనాడు ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రులను ఊరింకించిన ఘనత టీఆర్ఎస్‌విది అని అలాంటి బఫూన్‌లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
టీఆర్ఎస్వి విద్యార్థులు సైలెంట్‌గా ఉన్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించమని గొడకు వేలాడదీసిన తూపాకీ లాంటిది మా సహనం అన్నారు. ఇష్టం వచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతున్నారని గోబెల్స్ కూడా బీజేపీ నేతల ప్రచారాన్ని చూసి సిగ్గుపడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండు చోట్ల గెలిస్తేనే ఇంత అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు కేటీఆర్.