ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం..

152
ktr
- Advertisement -

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సులో మంత్రి కేటీఆర్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…మానవాభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలన్నారు. ఇందులో ప్రభుత్వ పాత్ర పరిమితంగానే ఉండొచ్చు, కానీ ప్రోత్సహించడానికి తాము కృషిచేస్తామన్నారు.

తమదైన లక్ష్యాలను నిర్ధేశించుకుని యువత ముందుకు సాగాలని, విద్యార్థి దశలోనే సమాజం పట్ల అవగాహన పెంచేందుకు పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొస్తామని వెల్లడించారు. వాళ్లలో అభిరుచి, దయాగుణం, విలువలు నేర్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

- Advertisement -