- Advertisement -
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఏడున్నరేళ్ల పాలనలో పారిశ్రామికాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన జర్మనీ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించామని చెప్పారు.
తొలి ప్రాధాన్యంగా విద్యుత్ సమస్య లేకుండా చేశామన్నారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులో ఉందని.. పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని.. ప్రస్తుతం 2వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. జర్మనీ పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ కోరారు.
- Advertisement -