హైదరాబాద్‌లో కోకాపేట్‌లో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టామ్ గ్రీకో – అడ్వాన్స్ ఆటో పార్ట్స్ ప్రెసిడెంట్ & సీఈఓ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వ్యాపారాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయని మంత్రి అన్నారు. ఆధునిక ఆటోమొబైల్ రంగంలో హైదరాబాద్‌కు అపార అవకాశాలున్నాయని తెలిపారు. అమెరికాకు చెందిన అగ్రశ్రేణి ఆటో మొబైల్ సంస్థ హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని కేటీఆర్ స్వాగతించారు. వచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా-ఈని ప్రారంభించబోతున్నాం. అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థను 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 450 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.