బీజేపీది వాట్సాప్ యూనివ‌ర్సిటీ: కేటీఆర్

309
ktr
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికల వేళ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌…బీజేపీది వాట్సాప్ యూనివ‌ర్సిటీయే అని ఎద్దెవా చేశారు. గోబెల్ బతికి ఉంటే బీజేపీ దగ్గర పాఠాలు నేర్చుకునే వార‌ని తెలిపారు.

రాష్ట్రంలో అన్నింటికీ డ‌బ్బులు తామే ఇస్తున్నామ‌ని చెప్పుకుంటున్న బీజేపీ నేత‌లు.. ర‌ఘునంద‌న్ రావు ఇంట్లో దొరికిన డ‌బ్బు మాత్రం త‌మ‌ది కాదంటున్నారు. కానీ ఆ న‌గ‌దుకు సంబంధించిన సాక్ష్యాలు బ‌య‌ట‌ప‌డిన విష‌యం అంద‌రికీ తెలుసు అని కేటీఆర్ చెప్పారు.

దుబ్బాక‌కు బీజేపీ, కేంద్రం ఏం చేసిందో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. న‌లుగురు బీజేపీ ఎంపీలు ఉన్న తెలంగాణ‌కు కేంద్రం నుంచి ఒక్క పైసా నిధులైనా అద‌నంగా తెచ్చారా? అని ప్ర‌శ్నించారు.

కరోనా కట్టడిలో తెలంగాణ విఫలం అయిందని కిషన్ రెడ్డి ఏ ఆధారంతో మాట్లాడారు? అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు కేటీఆర్. హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల గురించి మాట్లాడుతున్న బీజేపీ నేత‌లు.. బెంగ‌ళూరు వ‌ర‌ద‌ల గురించి ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని కేటీఆర్ అడిగారు.దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఘోరంగా దెబ్బ‌తీసింద‌ని….ఇప్పుడు జీడీపీ జీరో అని ఆర్థిక మంత్రి చెప్ప‌డం స‌రికాద‌న్నారు.

- Advertisement -