దుబ్బాకలో టీఆర్ఎస్ కు భారీ మెజార్టీ:హరీశ్ రావు

180
harish
- Advertisement -

దుబ్బాకలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి హరీశ్ రావు. చేగుంట రైతు సదస్సు లో మాట్లాడిన హరీష్ రావు..కిరాయి జనాలతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.దుబ్బాక లో అభివృద్ధి కొనసాగించాలంటే టీ ఆర్ ఎస్ కే మద్దతు ఇవ్వాలన్నారు.

వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండగ చేశారని…కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎరువుల, కరెంట్ కోసం రైతులు ఇబ్బందులు పడ్డారు. బీజేపీ వాళ్ళు బావుల వద్ద మీటర్లు పెడుతాం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ బిల్లులో సబ్సిడీ కరెంట్, ఉచిత కరెంట్ ఇవ్వద్దని అని….బావుల వద్ద మీటర్లు పెట్టాలని చెబుతుందన్నారు.

తెలంగాణ లో రైతుల బావుల వద్ద మీటర్లు పెడితే నిధులు ఇస్తాము అని కేంద్రం లేఖ రాసింది. అయినా సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం కేంద్రం ప్రతిపాదన ను వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కేంద్ర వ్యవసాయ చట్టాన్ని సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు.

బీజేపీ పార్టీని పాతరపెట్టాలి.కాళేశ్వరం నీళ్లతో దుబ్బాక ను సస్యశ్యామలం చేస్తామన్నారు. గ్రామ గ్రామన కొనుగోలు కేంద్రాలు పెట్టి పంట కొనుగోలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే…..మార్కెట్ లను ప్రైవేటు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది.తెలంగాణ లో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతు వ్యతిరేక పార్టీ లు.….రైతుల సంక్షేమ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.

- Advertisement -