రాహుల్‌కు కేటీఆర్ చురకలు..

232
minister
- Advertisement -

ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర రాష్ట్రంలో కొనసాగుతోంది. దేశాన్ని ఆర్ఎస్ఎస్ కబంధహస్తా నుండి దేశాన్ని విముక్తి చేయాల్సిన అవసరం ఉందని మండిపడ్డ రాహుల్…పనిలో పనిగా టీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో ఎంపీ రాహుల్‌కు కౌంటరిచ్చారు కేటీఆర్. అమేథీలో సొంత పార్లమెంటు సీటును కూడా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ… తెలంగాణ సీఎం కేసీఆర్ జీ జాతీయ పార్టీ ఆశయాలను అపహాస్యం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.తనను ఎన్నుకున్న ప్రజలను ముందుగా ఒప్పించడం రాహుల్ నేర్చుకోవాలని చురకలంటించారు.

పాదయాత్రలో భాగంగా మాట్లాడిన రాహుల్…టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదు, ఉండబోదని తేల్చిచెప్పారు. అలాగే కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించిన రాహుల్.. అవసరమైతే ఇంటర్నేషనల్ పార్టీ కూడా పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని… అవసరమైతే చైనా.. ఇతర దేశాల ఎన్నికల్లో కూడా పోటీ చేయొచ్చు అని సెటైర్లు వేశారు. ఐక్యరాజ్యసమితిలో తమ పార్టీ పేరు రిజిస్టర్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. దీనిపై రాహుల్‌కు చురకలంటించారు కేటీఆర్.

ఇవి కూడా చదవండి…

నిరాడంబరుడు…గుమ్మడి

గీతాగోవిందం దర్శకుడితో బాలయ్య!

మునుగోడు.. మునిగేది ఎవరో?

- Advertisement -