- Advertisement -
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కేంద్రమంత్రి నిర్మలా వ్యవహరించిన తీరు తనను బాధించిందని తెలిపారు మంత్రి కేటీఆర్. కష్టపడి పనిచేసే ఐఏఎస్ అధికారులను రాజకీయ వీధి నాటకంలో భాగంగా నేతలు నిరుత్సాహపరుస్తారని విమర్శించారు. అయినప్పటికీ కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హుందాగా వ్యవహరించిన తీరుకు అభినందనలు తెలుపుతున్నానంటూ కేటీఆర్ చెప్పారు.
నిన్న కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సీతారామన్.. వీ పాటిల్ తో మాట్లాడుతూ ఉచిత రేషన్ బియ్యంలో కేంద్ర వాటా ఎంత? అని అడిగిన విషయం తెలిసిందే. ఆయన సమాధానం చెప్పలేకపోవడంతో.. ఐఏఎస్ అధికారి అయినప్పటికీ ఈ విషయం తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, రేషన్ షాపు వద్ద ఫ్లెక్సీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటో కూడా లేకపోవడంతో నిర్మలా ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -