ఈటలది ఆత్మ వంచన: కేటీఆర్

161
ktr
- Advertisement -

ఈటల రాజేందర్ ఆత్మవంచన చేసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్..ఈటల రాజేందర్ కు టీఆర్‌ఎస్ ఎంత ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఈటల రాజేందర్ కు టీఆర్‌ఎస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలి…. మంత్రిగా ఉండి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టారని మండిపడ్డారు.

ఈటల రాజేందర్ తప్ప చేయకుండానే ఒప్పుకున్నారా?… ఈటల రాజేందర్ పై సానుభూతి ఎందుకు ఎట్లా వస్తది! అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఐదేళ్ల కిందట నుంచి కేసీఆర్ తో గ్యాప్ ఉంటే ఎందుకు మంత్రిగా కొనసాగారు?…. ఐదేళ్ల నుంచి ఈటల రాజేందర్ అడ్డంగా మాట్లాడినా మంత్రిగా కేసీఆర్ ఉంచారన్నారు.

ఈటల రాజేందర్ చివరి వరకు పార్టీలో ఉండాలని ప్రయత్నం నేను వ్యక్తిగతంగా చేశానని….ఈటల రాజేందర్ సీఎం ను కలువను అని స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత నేను ఎమ్ చేయగలనని వెల్లడించారు. ఈటెల రాజేందర్ పార్టీలోకి రాకముందు కూడా హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ బలంగానే ఉందని… కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇచ్చిందో చెప్పాలన్నారు. జల జీవన్ మిషన్ కు అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది…తెలంగాణ కు ఇవ్వడం లేదన్నారు. టీఆర్ఎస్‌ అభివృద్ధి బీజేపీ ఖాతాలో ఈటెల ఎలా వేసుకుంటారని ప్రశ్నించిన కేటీఆర్…హుజురాబాద్ లో పోటీ టిఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మద్యే..కానీ వ్యక్తుల మధ్య కాదన్నారు.

- Advertisement -