మాటల కన్నా చేతలకే టీఆర్ఎస్ ప్రాధాన్యత- కేటీఆర్‌

152
ktr
- Advertisement -

టీఆర్ఎస్ మాటల కన్నా చేతలకే ప్రాధాన్యత నిస్తోంది.జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత నిచ్చామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. మంగళవారం తెలంగాణ భవన్‌లో బీసీ సంఘాలతో మంత్రి కే టీ రామారావు, మంత్రి ఈటల రాజేందర్ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పేదరికానికి కులం లేదు..అందరినీ కడుపులో పెట్టుకుని చూస్తోంది సీఎం కెసిఆర్ యే. మూడు శాసనమండలి సభ్యులకు అవకాశమిస్తే ఒక్క ఎంబీసీ వర్గానికి ఇచ్చాము. రానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యత నిస్తామని సీఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు. కుల వృత్తుల పరిరక్షణకు అనేక చర్యలు చేపట్టాం..ఫలితాలు రాబట్టాం.సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇంక కొన్ని సమస్యలున్న మాట నిజం..వాటి పరిష్కారం టీఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం అని కేటీఆర్‌ అన్నారు.

పూల బొకే లాంటి హైదరాబాద్ ను విచ్చిన్నం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి చెందిన పెద్ద మనిషి పిచ్చిగా మాట్లాడుతున్నారు. పచ్చగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెడుతున్నారు. నాలుగు ఓట్ల కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండటం ఇదే మొదటి సారి చూస్తున్నన్నారు కేటీఆర్‌. హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారట…హోష్ లో ఉండే మాట్లాడుతున్నారా ?.హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది..దీన్ని చెడ గొట్టే ప్రయత్నం కోసమే దిగజారి మాట్లాడుతున్నారు..ఎవరేం మాట్లాడుతున్నారో బేరీజు వేసుకోండి..ఎంబీసీలను కలుపుకుని పోతున్నాం మేము..వారికి టిక్కెట్లు ఇచ్చాము.. ఇక ముందు కూడా ఇస్తాం..అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నాన్ని వ్యతిరేకిద్దాం. 37 బీసీ సంఘాలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతునివ్వడం శుభ పరిణామం అన్నారు కేటీఆర్‌.

- Advertisement -