ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించాలిః కేటీఆర్

330
ktr
- Advertisement -

రాష్ట్ర పుర‌పాల‌క‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్బంగా జిల్లాలో ప‌లు అభివృద్ది ప‌థ‌కాల‌ను ప్రారంభించారు. రూ.2 కోట్లతో వ్య‌యంతో కొల్లమద్ది గ్రామంలో ఎగువ మానేరు ప్రధాన ఫీడర్ ఛానెల్‌లో పూడికతీత పనులను మంత్రి ప్రారంభించారు. నర్మాలలో రెండు చెక్‌డ్యామ్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.నర్మాల గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేసి, అనంతరం సీసీ కెమెరాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లమద్ది గ్రామంలో ఈ జీ ఎస్ కార్మికులతో మాట్లాడారు.ఉపాధి హామీ పనులు చేపట్టేప్పుడు విధిగా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్​ సూచించారు. జలహితం కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేటలోని నర్మాల ప్రాజెక్టు కాల్వల పూడికతీత పనుల్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. రోజుకు ఏమేర కూలీ గిట్టుబాటు అవుతుందో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోందని ముఖానికి తప్పకుండా మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. కరోనా సోకినా ఆందోళన చెందవద్దని చెప్పారు. ఈ పూడికతీత పనులు పూర్తి అయితే వ్యవసాయానికి సాఫీగా నీరందుతాయని హామీ ఇచ్చారు.

అనంతరం సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవన్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అధ్యక్షతన జరిగే జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.ఈకార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఇంచార్జీ జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీ ఆర్ అంజయ్య , రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఆకునూరీ శంకరయ్య, సెస్ చైర్మన్ శ్రీ దోర్నాల లక్ష్మారెడ్డి,RDO శ్రీ టి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -