పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఈరోజు తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పురపాలక శాఖ తరపున సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నదని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ తరఫున ప్రతి ఆదివారం- పది గంటలకి -పది నిమిషాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ కార్యక్రమంలో స్వయంగా భాగస్వాములవుతూ, ప్రజల అందరినీ భాగస్వాములను చేస్తూ రానున్న వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు రాకుండా చూద్దామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుకు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మునుపెన్నడు ఎరుగని విధంగా ప్రస్తుతం కరోనా మహమ్మారి మన ప్రపంచాన్నిప్పుడు పట్టిపీడిస్తున్నదని, ఈ కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలను తీసుకుంటూ, ప్రజలందరీ సహకారంతో కొవిడ్-19 పై పోరాడుతున్నామని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ వైరస్‌పై మనందరం చేస్తున్న సమిష్టి పోరాటం వలన ప్రజారోగ్యం, వ్యక్తిగత శుభ్రత వంటి అత్యంత కీలకమైన అంశాల్లో మనందరిలో కొంత సానుకూల మార్పు వచ్చిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ అలవాట్లను, అలోచన విధానాన్ని కొనసాగిస్తూ అరోగ్యవంతమైన జీవితాలను గడిపేందుకు ముందుకుసాగాలస్సిన సమయమిదని, మరోవైపు రానున్న వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాదుల పట్ల ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. గతంలో మనందరం పాల్గోన్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
ప్రతి వర్షకాలంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి అనేక సీజనల్ వ్యాదులు మనల్ని పట్టిపీడిస్తున్న విషయం మన అనుభవంలో ఉన్నదన్న కెటియార్, దోమల నివారణ కోసం కొన్ని జాగ్రత్తలతో ఇలాంటి ఇబ్బందులను తప్పించే అవకాశం మన చేతుల్లోనే ఉన్నదని తెలిపారు. ఇందుకావాల్సిందల్లా వారంకోసారి కనీసం పది నిముషాలపాటైనా మనకోసం, మన పరిసరాల శుభ్రత కోసం సమయం కేటాయించుకోవడమఅని,. అందుకే ఈ సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ ఇప్పటికే ఒక ప్రత్యేక క్యాలండర్ను అరోగ్యశాఖ సహాయంతో తయారు చేసి, వాటిని అరికట్టేందుకు పారిశుద్ద్యం వంటి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసిందన్నారు. ప్రత్యేక కార్యచరణ ద్వారా పురపాలక శాఖ తరపున చేపట్టాల్సిన దోమల నివారణ, పారిశుద్ద్య కార్యక్రమాలపైన పలు సూచనలిచ్చామమని, ఇందులో భాగంగా డిస్ ఇన్ఫక్టంట్ల వినియోగం, యాంటీ మస్కిటో కార్యక్రమాల్లో భాగంగా మలాథియాన్ స్ప్రే, అయిల్ బాల్స్, ఫాగింగ్ వినియోగం చేయాలని సూచించామని తెలిపారు.
దీంతోపాటు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల నేపథ్యంలో సొడియం హైపో క్లోరైడ్ ద్రావణ స్ప్రేను సైతం ప్రతి వారంకోసారి ఉపయోగించనున్నామని, వీటితోపాటు పారిశుద్ద్య కార్యక్రమాలతోపాటు మురికి కాల్వల పూడిక తీత, లోతట్టు ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటి ఎత్తిపొయడం, ప్రతి రోజు చెత్త తరలింపు కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా చేపట్టాలని పురపాలక సంఘాలకు ప్రభుత్వం తరపున అదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీంతోపాటు మన ప్రజలను, పట్టణాలను కాపాడుకోకునే కార్యక్రమంతో ప్రజలను భాగస్వాములను చేసేందుకు గత వారం “ప్రతి ఆదివారం-పది గంటలకు-పదినిమిషాలు” కార్యక్రమాన్ని ప్రారంభించామని,. రానున్న పదివారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ప్రతి అదివారం పదినిమిషాల పాటు తమ ఇళ్లు, పరిసరాల్లో దోమలు నిలిచి ఉండేందుకు అస్కారమున్న వాటిని శుభ్రపరుచుకోవడం, యాంటీ లార్వా కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా తన లేఖలో కోరారు. ఈ కార్యక్రమంతో ప్రతి ఒక్క పట్టణ పౌరుడు పాల్గొనే విధంగా చూడాలని, అందుకు మీ సహకారం అందించాలని అశిస్తున్నట్లు తెలిపారు.
శాసన సభ్యులు ముందుగా ఈ కార్యక్రమాన్ని తమ తమ ఇళ్ల నుంచే ప్రారంభించాలని, తర్వతా తమ పరిధిలోని పట్టణాల్లో విస్తృతంగా తిరుగుతూ ప్రజాఆరోగ్యం పైన చైతన్యం తీసుకువచ్చే విధంగా ప్రజలను సమాయత్తం చేస్తూ, పరిసరాల పరిశుభ్రత ఓ సామాజిక కార్యక్రమంగా ప్రజలు భావించే విధంగా ప్రచారం కలిపించాలని మనవి చేశారు. దోమల నివారణకోసం వారి ఇంటి పరిసరాలలో నీటి నిలువ ఉండకుండా తీసుకోవాల్సిన చర్యలు, వర్షాకాలంలో దోమల వలన వచ్చే సీజనల్ వ్యాధుల నివారణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల విషయంలో ఇప్పటి నుంచే పట్టణాలలో అవగాహాన తీసుకురావాలని విజ్ఝప్తి చేశారు. ఇందుకోసం పురపాలక శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఈ మేరకు సీజనల్ వ్యాదుల కట్టడికి మీరు చేపట్టే కార్యక్రమాలు కరపత్రాలు, స్ధానిక మీడియా వంటి మార్గాలను సంపూర్ణంగా ఉపయోగించుకుని ప్రజలకు చేరేలా చూడాలన్నారు. మనందరం కలిస్తే రానున్న వర్షకాలంలో సీజనల్ వ్యాదుల ప్రభావాన్ని సాద్యమైనంత మేర తగ్గించగలమన్న నమ్మకం నాకున్నద మంత్రి పెర్కోన్నారు. మన కుటుంబాలను, పట్టణాలను, ప్రజలను సీజనల్ వ్యాదుల నుంచి కాపాడుకోవడంతో మీఅందరి సహాయాన్ని కొరుతున్నట్లు మంత్రి కేటీఆర్ తన లేఖలో పెర్కోన్నారు.