KTR:నల్గొండలో మంత్రి కేటీఆర్‌ రోడ్ షోలు

65
- Advertisement -

గత 7 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఏడు రోజుల్లో 29 నియోజకవర్గాల్లో కేటీఆర్ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మంత్రి కేటీఆర్ రోడ్ షోలకు మంచి స్పందన వస్తోంది. కేటీఆర్ రోడ్ షోల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

ఇక రేపు బుధవారం నల్గొండలో రోడ్ షోలలో పాల్గొననున్నారు కేటీఆర్. ఉదయం 11 గంటలకు మునుగోడులో మధ్యాహ్నం 1 గంటకు నాగార్జున సాగర్‌లో అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కోదాడలో నిర్వమించే రోడ్‌ షోలలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు కేటీఆర్.

కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, బీఆర్ఎస్ పదేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ మంత్రి కేటీఆర్ ప్రసంగం సాగుతోంది. ఇక కేటీఆర్ సభలకు జనం పోటెత్తుండటంతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:హాయ్ నాన్న..ట్రైలర్ ముహుర్తం ఫిక్స్

- Advertisement -