మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభివృద్ధిపై కేటీఆర్ రివ్యూ….

172
ktr
- Advertisement -

జియచ్ యంసి పరిధిలోని చేపడుతున్న కార్యక్రమాలపైన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ ఎమ్మెల్యేలతో పురపాలక శాఖ మంత్రి కె.తారక రామరావు ఈ రోజు సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో అయా అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మెహాన్ లతో కలసి సమీక్షించారు.

ఈ సందర్భంగా లాక్ డౌన్ సమయాన్ని జియచ్ యంసి రోడ్ల లేయింగ్, నిర్మాణం వంటి పనులకు చక్కగా వినియోగించుకున్నారని, ఈ విషయంలో ప్రజలనుంచి మంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. చాల మంది లాక్ డౌన్ అనంతరం బయటకు వచ్చి తమ కాలనీల్లో మారిన రోడ్లను చూసి హర్షం వ్యక్తం చేశారని యంఏల్యేలు తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం వారీగా చేపట్టాల్సిన పనులపైన యంఏల్యేలు మంత్రికి వివరించారు. స్ధూలంగా జియచ్ యంసి ద్వారా పనులు వేగంగా నడుస్తున్నాయన్నారు.

ముఖ్యంగా ఎల్ బినగర్ చౌరాస్తా వంటి చోట్ల మెత్తం రూపురేఖలు మారిపోయాయని, అంత వేగంగా ఇన్ఫ్రా పనులు జరిగాయాన్నారు. ఏస్ అర్ డిపి పనులు ద్వారా అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతున్నాయన్నారు. ఈ సమావేశం సందర్భంగా ప్రతి నియోజక వర్గానికి ఒక పెద్ద మహా ప్రస్థానం లాంటి వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే అనుమతులు వచ్చిన చెరువుల అభివృద్ది, సుందరీకరణ పనులు మరింత వేగంగా జరిగేలా చూడాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సానిటేషన్ పనులు భాగానే కోనసాగుతున్నాయని, జల మండలి పరిధిలోకి వచ్చిన సీవరేజి నిర్వహాణపైన కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.

తమ నియోజక వర్గాల పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడంపైన చర్యలు తీసుకోవాలని యంఏల్యేలు కోరారు. ఈ సంవత్సరాంతానికి సూమారు 75 వేల ఇళ్లు పంపీణీకి సిద్దంగా ఉంటాయని మంత్రి కెటియార్ తెలిపారు. పుత్ పాత్లు, పబ్లిక్ టాయిలేట్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వారికి తెలిపారు. దీంతోపాటు లింక్ రోడ్లు, పార్కుల అభివృద్ది వంటి కార్యక్రమాలు కూడా జియచ్ యంసికి మంచి పేరు తీసుకువచ్చాయని యంఏల్యేలు మంత్రికి తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా తమ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన పనుల తాలుకు విజ్ఝప్తిలను అందజేశారు. అన్నింటికి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి హమీ ఇచ్చారు.

- Advertisement -