ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రద్దు..

68
sabitha indrareddy

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దుచేసిన ప్రభుత్వం…తాజాగా ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దూ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ప్రకటన చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మార్చి 2020 ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలను 10 రోజుల తర్వాత అందజేస్తమని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

ఈ మేరకు విద్యార్థులకు జులై 31 తర్వాత సంబంధిత కళాశాలల్లో మార్కుల మెమోలు జారీచేస్తారని తెలిపారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్య్టా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో1.47 లక్షల మంది విద్యార్థులకు ఊరట లభించనుంది.