మీరేమంటారు..ప్రజలకు కేటీఆర్ ప్రశ్న?

45
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న విషప్రచారంపై స్పందించారు మంత్రి కేటీఆర్. భావప్రకటన స్వేచ్ఛ అంటే కించపరిచేలా మాట్లాడడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదన్నారు. ముఖ్యమంత్రిని అవమానించేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రితో పటు ప్రజాప్రతినిధులను అవమానించేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇక ఈ విషయంలో బీజేపీ వైఖరిని తప్పుబట్టారు కేటీఆర్. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే 14 రోజుల జైలు శిక్ష తప్పదని మన రాష్ట్రంలో కూడా అమలుచేస్తేనే అలాంటి వారికి తెలిసోస్తుందన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం చెప్పాలని ప్రజలను కోరారు. అలాగే కన్నడ యాక్టర్ చేతన్ అరెస్టు వీడియోను ట్వీట్ కు మంత్రి కేటీఆర్ జతచేశారు. హిందుత్వంపై అభ్యంతరకర ట్వీట్ చేశాడంటూ కన్నడ యాక్టర్ చేతన్ ను కర్నాటక పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. చేతన్ ను కోర్టు 14 రోజుల కస్టడీకి ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పై విధంగా స్పందించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -