కేంద్రానికి మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న..

63
- Advertisement -

దేశంలో త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తీసుకుకొచ్చిన అగ్నిపథ్ స్కీంను వ్యతిరేఖిస్తూ ఆందోళలను జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ స్కీంపై మంత్రి కేటీఆర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో ప్రధాని మోదీ- అదానీ అవినీతి బంధంపై వస్తున్న ఆరోపణలపై దేశం దృష్టిని మరల్చేందుకే ఈ పథకాన్ని ప్రకటించారా? అని ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీని, ప్రధాని మోదీని కేటీఆర్ గతంలోనూ ప్రశ్నించారు. తాజాగా అగ్నిపథ్ పథకాన్ని ఈ వివాదంతో ముడిపెడుతూ ట్వీట్ చేశారు.

ఇటీవల శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు ఇచ్చేలా లంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సపై మోదీ ఒత్తిడి తెర్చారని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఫెర్డినాండో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, తన పదవికి రాజీనామా చేశారు. కానీ, ఈ వ్యాఖ్యలపై భారత్ లో విపక్షాలు మోదీపై విమర్శలు గుప్పించాయి. ఈ వ్యవహారంలో శ్రీలంకలో కూడా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.

- Advertisement -