కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు?: కేటీఆర్

122
minister ktr
- Advertisement -

తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…తెలంగాణ‌కు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంద‌ని …ప్ర‌పంచంలోని అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వ‌రానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వ‌రు? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

కర్ణాట‌క‌లోని అప్ప‌ర్ భ‌ద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంత అన్యాయం జ‌రుగుతున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నార‌ని విమర్శలు గుప్పించారు. కాళేశ్వ‌రానికి జాతీయ హోదా ఇవ్వ‌క‌పోవ‌డం వివ‌క్ష కాదా అని నిలదీశారు.

- Advertisement -