- Advertisement -
మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ప్రశంసలు గుప్పించారు మంత్రి కేటీఆర్. అధికారులు, మంత్రి సబితా కృషితో తెలంగాణ వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం సర్కారు బడుల్లో నమోదు సంఖ్య రెట్టింపు అయిందన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు.
మన ఊరు – మన బడి, ఇంగ్లీష్ మీడియం చదువులతో ఈ ఏడాది వేలమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వదిలి సర్కారు బడి బాట పట్టారు. ఇప్పటివరకు 61,129 మంది విద్యార్థులు ప్రైవేట్‌ను వీడి సర్కారు స్కూళ్లల్లో చేరారు. బడిబాట కార్యక్రమం ముగిసినా సెప్టెంబర్ వరకు అడ్మిషన్లు తీసుకొంటామని అధికారులు తెలిపారు.
- Advertisement -