రంజిత్ రెడ్డి ఎంపీ కావడం ప్రజల అదృష్టం: కేటీఆర్

94
ktr minister
- Advertisement -

రంజిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ కావ‌డం ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల అదృష్ట‌మ‌ని కేటీఆర్ అన్నారు. రంజిత్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా బేగంపేటలో దివ్యాంగులకు 105 మందికి ట్రై మోటార్ వాహనాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్….ఎంపీ రంజిత్ రెడ్డి గొప్ప మాన‌వ‌తావాది అని ప్ర‌శంసించారు. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై రంజిత్ రెడ్డి పార్ల‌మెంట్‌లో ప్ర‌శ్నిస్తున్నారు..మరోవైపు సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులను గెలుచుకున్నారని కొనియాడారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద దివ్యాంగుల‌కు చేయూత‌నిస్తున్నారు. చేవెళ్ల‌లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు 7 అంబులెన్స్‌లు ఇచ్చారు…. చేవెళ్ల పార్ల‌మెంట్ ప‌రిధిలోని ప్ర‌తి గ్రామానికి విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసుల కోసం అన్ని గ్రామాల‌కు డిజిట‌ల్ టీవీలు అందించారని చెప్పారు.

- Advertisement -