అక్టోబర్‌ 22న నాట్యం..

48
NATYAM Movie Release Date Announce

ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌రాజు ప్రధానపాత్రలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాట్యం’. నిశృంక‌ల ఫిల్స్మ్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్ర టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్‌ అయింది. అక్టోబర్ 22న థియేటర్స్‌లో నాట్యం సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్‌చేశారు మేకర్స్‌.

క‌మ‌ల్‌కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్, భానుప్రియ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్ర‌వ‌న్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న సంధ్య‌రాజు, స‌త్యం కంప్యూట‌ర్స్ స‌ర్వీసెస్ ఫౌండ‌ర్ బీ రామ‌లింగ‌రాజు కోడ‌లు.

NATYAM Movie Release Date Announcement | Oct 22nd ( Theatrical Release)