ఎంపీ రంజిత్ రెడ్డిని ప్రశంసించిన మంత్రి కేటీఆర్..

385
mp ranjith
- Advertisement -

మంత్రి కేటిఆర్ తన జన్మదినం సంద‌ర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్రమంలో భాగంగా వికలాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయాలని ట్విట్టర్ ద్వారా పిలుపును ఇవ్వగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి తన వంతుగా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చిన మొత్తం వికలాంగుల దరఖాస్తులకు తన సొంత నిధులతో వాహనాలను సమకూరుస్తానని ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. దీనిని చూసిన మంత్రి కేటీఆర్ ఎంపీ రంజిత్ రెడ్డిని అభినందించి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ…యువ నాయకుడు,మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రజలకు ఏదో ఒక్క సహాయ కార్యక్రమం చేపడుతామని,ఈ సారి వికలాంగులకు మూడు చక్రాల వాహనాలను తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వచ్చిన మొత్తం 101 వికలాంగుల దరఖాస్తు దారులకు త్వరలో పంపిణీ చేస్తాం అన్నారు. ప్రజలు,నాయకులు మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎంపీ రంజిత్ రెడ్డి చూపిన ఉదారతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -