ఎమ్మెల్యే రవిశంకర్‌పై మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు..

392
- Advertisement -

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన భార్య భర్తలు ఇద్దరూ చనిపోవడంతో సమత,మమత అక్క చెల్లెలు అనాథలుగా మారారు. ఉన్న పూరి గుడిసె కూలిపోయింది. దీనితో చెలించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అక్క చెల్లెళ్లను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. లాక్ డౌన్ ముగియగానే సమతకు ఉపాధి కల్పిస్తామని మమతకు వివాహం చేస్తామని హామీ ఇచ్చారు. చిన్న అమ్మాయి మమతకు గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించి చదివిస్తామని తెలిపారు.

ప్రస్తుతం 20,000 ఇరవై వేయిల రూపాయలు ఆర్థిక సహాయం, ఒక క్వింటాలు బియ్యం అందజేశారు. వీరిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. అయితే తక్షణమే సహాయం అందించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై మంత్రి కేటీఆర్‌,కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ ప్రశంసించారు. గొప్ప పని చేశారు ఎమ్మెలే రవిశంకర్‌ గారు అంటు వారు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

karimnagar collector

 

- Advertisement -