హైదరాబాద్ భారత్ బయోటెక్ నుండే తొలి కరోనా వ్యాక్సిన్ వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లోని భారత్ బయోటెక్ కేంద్రాన్ని సందర్శించిన కేటీఆర్….. కరోనా వ్యాక్సిన్ తయారిపై శాస్త్రవేత్తలతో చర్చించారు.అనంతరం సంస్ధ ఉద్యోగులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ….కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజంలో ఉండడం గర్వంగా ఉందన్నారు. కరోనాకు టీకా తొలుత హైదరాబాద్ నుంచి, అందులో భారత్ బయోటెక్ నుంచి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందరి కృషివల్లే ఇది సాధ్యమవుతోందన్నారు.
టీకాల అభివృద్ధి, తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచదేశాలు పదేపదే చెబుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ ప్రాముఖ్యత కూడా పెరిగినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్లా, సుచిత్రా ఎల్లా కూడా పాల్గొన్నారు .