రైతుల అవిశ్రాంత పోరాటంతో సాగు చట్టాలు రద్దు: కేటీఆర్

98
ktr
- Advertisement -

సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా స్పందించారు మంత్రి కేటీఆర్. భార‌తీయ రైతులు మ‌రోసారి త‌మ స‌త్తాను చాటార‌ని, అవిశ్రాంత‌ పోరాటం వ‌ల్ల త‌మ డిమాండ్ల‌ను సాధించుకున్న‌ట్లు తెలిపారు. తన కామెంట్‌కు విజ‌య‌సూచిక ఉన్న ఎమోజీని జోడిస్తూ జైకిసాన్, జై జ‌వాన్‌ అంటూ కామెంట్ చేశారు. ఫార్మ్‌లాస్‌రిపీల్డ్‌, టీఆర్ఎస్ విత్ ఫార్మ‌ర్స్‌, ఫార్మ‌ర్స్ ప్రొటెస్ట్ హ్యాష్‌ట్యాగ్‌ల‌ను కూడా మంత్రి త‌న ట్వీట్‌లో పోస్టు చేశారు.

అధికారంలో ఉన్నవారి శ‌క్తి క‌న్నా.. ప్ర‌జాశ‌క్తియే ఎప్ప‌టికీ గొప్ప‌ద‌ని మంత్రి కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. రైతుల చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించ‌డంలో తెలంగాణ స‌ర్కార్ ముందున్న విష‌యం తెలిసిందే. కేంద్రం తెచ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ తెలంగాణ ప్ర‌భుత్వం ఆందోళ‌న కూడా చేప‌ట్టింది.

- Advertisement -