- Advertisement -
దేశంలో పలు చోట్ల అగ్నిపథ్ ఆందోళనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆర్మీ ఉద్యోగార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన బాటపట్టారు. రైల్వే స్టేషన్ విద్వంసం సృష్టించి పలు రైళ్లు తగులబెట్టారు. అయితే ఈ అంశంపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈమేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక నిరసనలు దేశంలో నిరుద్యోగ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు నిదర్శనం అని కేటీఆర్ తెలిపారు. ఈ ఆందోళనలు చూసైనా కేంద్రం కళ్లు తెరవాలని హితవు పలికారు. ముందు రైతుల బతుకులతో ఆడుకున్న కేంద్రం ఇప్పుడు జవాన్లతో భవిష్యత్తుతో ఆడుకుంటోందని కేటీఆర్ దుయ్యబట్టారు. సాయుధ బలగాల విషయంలో కేంద్రం తీరు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్ నో పెన్షన్ అన్నట్టుగా ఉందని మంత్రి కేటీఆర్ సటైర్ వేశారు.
- Advertisement -