దావోస్‌ వేదికగా… జ‌గ‌న్‌తో కేటీఆర్ భేటీ!

153
ktr jagan
- Advertisement -

తెలంగాణ‌కు పెట్టుబ‌డులు తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా దావోస్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సుకు మంత్రి కేటీఆర్ హాజరైన సంగ‌తి తెలిసిందే. తొలిరోజు ప‌లు అంత‌ర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువ‌చ్చాయి. తొలిరోజే దాదాపు రూ. 600 కోట్ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించింది తెలంగాణ‌..

ఇక ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించిన కేటీఆర్…నా సోదరుడు సీఎం జగన్‌తో గొప్ప సమావేశం జరిగింది అంటూ ఫొటోలను ట్వీట్‌ చేశారు.

తెలంగాణ‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు లూలు గ్రూపు అధిపతి యూసుఫ్‌ అలీ ప్రకటించారు. అలాగే స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్‌, ఫైనా న్స్‌, బీమా రంగ సంస్థ స్విస్‌రీ హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.

- Advertisement -