- Advertisement -
టీడీఆర్ (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్) బ్యాంక్‌ను మున్సిపల్, ఐ టీ శాఖ మంత్రి కె తారక రామా రావు శుక్రవారం ప్రారంభించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణ,నాలా, లేక్స్, చెరువులు అభివృద్ధి పనులకు భూ సేకరణ చట్టం క్రింద సేకరించిన భూములకు సంబందించిన యజమానికి జారీ చేసిన టీడీఆర్ సర్టిఫికెట్స్ డిమాండ్ పెంచి వినియోగించుటకు, విక్రఇంచుటకు టీడీఆర్ అప్లికేషన్‌ను జిహెచ్ఎంసి రూపోందించింది.
ఎంసీహెచ్‌ఆర్‌డీ లో జిహెచ్ఎంసి,హెచ్‌ఎండీఏ ప్లానింగ్ అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, పుర పాలన ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్,ప్లానింగ్ డైరెక్టర్ విద్యా సాగర్, సీసీపీ దేవేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -