ఆహ్లాదభరితంగా ట్యాంక్ బండ్..

35
ktr minister

హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది ముఖ్యంగా ట్యాంక్ బండ్. ఆ ట్యాంక్ బండ్ ఇప్పుడు కొత్త అందాలతో మరింత ఆహ్లాదకరంగా కనువిందు చేస్తోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ మీదకి వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.

గత వారం ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేటీఆర్…ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ వాహనాలను నిషేధించాలని డీజీపీని కోరారు. దీంతో ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాగా పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది.

పర్యాటకులతో సందడిగా మారిన వీడియోని షేర్ చేసిన కేటీఆర్.. సంతోషాన్ని వ్యక్తం చేశారు.