టీఎస్ క్రెడాయ్‌ను ప్రారంభించిన కేటీఆర్‌…

43
- Advertisement -

ప్రజలకు మంచి చేయాలని నాయకుడికి దృఢ సంకల్పం ఉంటే ఆలోచన ఉంటే మార్పు ఖచ్చితంగా వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నానక్‌రామ్ గూడలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని నానక్‌రామ్‌గూడలో మంత్రి కేటీఆర్ క్రేడాయ్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. సాయిచంద్‌ మరణవార్త విని కార్యక్రమాన్ని రద్దుచేద్ధామనుకున్నాం అయినప్పటికీ తప్పనిసరిగా హాజరయ్యాను. తమ్ముడు సాయిచంద్‌కు ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాని అన్నారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ..హైదరబాద్‌ నగర అభివృద్ధి కానీ వనరుల సద్వినియోగం విషయంలో కానీ ఏ రంగంలో చూసుకున్న నేడు హైదరాబాద్‌ నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నగరవాసులంతా హైదరాబాద్‌ను చూసి గర్వపడుతున్నారని కొనియాడారు. అన్ని రంగాల్లో హైదరాబాద్ నగరం మేటి నగరంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో జరిగే ఎలక్షన్‌లో మళ్లీ బీఆర్ఎస్‌ వస్తుందని అన్నారు.

Also Read: KTR:సాయిచంద్‌ మృతి బీఆర్ఎస్‌కు తీరని లోటు

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో గడిచిన 9యేళ్ల చేసిన అభివృద్ధి ఎంతో సాధించిందో అన్నారు. ఈ తొమ్మిదేళ్లలో మీరంతా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే..అసలు సినిమా ముందుందన్నారు. సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రణాళికలే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా నిలబెడుతుందన్నారు. 2023లో 99స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు.

Also Read: ప్రజల్లో చైతన్యం నింపిన సాయిచంద్..

- Advertisement -