డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌..

86
ktr

బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేసీఆర్ నగర్లో రూ. 10.56 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

అంతకుముందు ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ (48) మరియు రాచర్ల గొల్లపల్లి (48) గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎంపీ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.