అజీమ్ ప్రేమ్‌జీ జీవితం అంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయం- కేటీఆర్‌

75
Minister KTR
- Advertisement -

మంగ‌ళ‌వారం విప్రో సంస్థ త‌న త‌యారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. రూ.300 కోట్లతో ఏర్పాటైన ఈ యూనిట్‌ను విప్రో సంస్థ నగర శివారులోని మ‌హేశ్వ‌రంలో ఏర్పాటు చేసింది. ఈ -సిటీలో విప్రో క‌న్‌స్యూమ‌ర్ కేర్ ఫ్యాక్ట‌రీని ఆ సంస్థ చైర్మ‌న్ అజీమ్ ప్రేమ్ జీతో క‌లిసి మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అజీమ్ ప్రేమ్‌జీ వంటి గొప్ప వ్య‌క్తి మ‌న మ‌ధ్య ఉండ‌టం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఆయ‌న జీవితం అంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయం, అనుస‌ర‌ణీయం, మంచి పాఠం అని పేర్కొన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌నే ఆయ‌న త‌త్వం అంద‌రికీ ఆద‌ర్శ‌మ‌ని కొనియాడారు. ఈ యూనిట్ ద్వారా 900 మందికి ఉపాధి ల‌భించ‌నుంద‌ని, అందులో 90 శాతం మంది స్థానికులేన‌ని కేటీఆర్ తెలిపారు.

కాగా, మ‌హేశ్వ‌రంలో అత్యాధునిక టెక్నాల‌జీతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో సంతూర్ స‌బ్బుల‌తో పాటు సాఫ్ట్ ట‌చ్ ఫ్యాబ్రిక్ కండిష‌న‌ర్‌ల‌ను విప్రో ఉత్ప‌త్తి చేయ‌నుంది. ఈ యూనిట్‌కు నిమిషానికి ఏకంగా 700 సంతూర్ సబ్బులను త‌యారు చేసే సామ‌ర్థ్యం ఉంద‌ని కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. దేశంలో ఇంత వేగంగా స‌బ్బుల ఉత్ప‌త్తిని చేప‌ట్ట‌నుండ‌టం ఇదే తొలిసారని కూడా ఆ కంపెనీ ప్ర‌క‌టించింది.

- Advertisement -