గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరో కునాల్..

63
gic
- Advertisement -

ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుందన్నారు హీరో కునాల్, తన తాజా వెబ్‌ సిరీస్‌ “అభయ్-3”ని జీ-5లో విడుదల చేస్తున్న సందర్భంగా వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా కునాల్, డైరెక్టర్ ఖేన్ ఘోష్‌తో కలిసి బంజారాహిల్స్, కెబీఆర్ పార్క్‌లో మొక్కను నాటి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పాల్గొన్నారు.

అనంతరం కునాల్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం వల్ల ఇప్పటికే ఈ భూమిపై అనేక విపత్తులు సంభవిస్తున్నాయని.. అది ఆగాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని ఆయన సూచించారు. అందు కోసం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లాంటి కార్యక్రమాన్ని రూపొందించి, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. వారి కృషి మరింత ముందుకు సాగాలంటే విధిగా మనమంతా “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో భాగం కావాలి. విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తన తరపున సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, సోహా అలీ ఖాన్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు హైదరాబాద్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏం. జోజి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -