షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌..

24

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి అయ్యి అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా రూ.333 కోట్లతో రాయదుర్గం – టోలిచౌకి మధ్య 2.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన షేక్ పెట్ ఫ్లై ఓవర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపుడి గాంధీ, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మరియు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.