- Advertisement -
దేశానికే అన్నం పెట్టే స్ధాయిలో తెలంగాణ ఉందన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం బొప్పాపూర్‌లో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్…స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ ప్రధాని, ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా మన కేసీఆర్ రైతుల కోసం ఆలోచించారని వెల్లడించారు.
రైతు ఏ పరిస్థితులలో కూడా చేయి చాపవద్దని మన ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుల కోసం ఋణ మాఫీని ప్రకటించారని పేర్కొన్నారు కేటీఆర్. రైతుల కోసం రైతు బందు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలములో ఎరువులు, విత్తనాలు అందేలా కృషిచేస్తున్నారని గుర్తుచేశారు.. రాష్ట్రంలో ఆరు నెలల కాలంలో 26 వందల రైతు వేదికలను నిర్మించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.
- Advertisement -